![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1008 లో.. అనుపమ తన పెద్దమ్మకి కాల్ చేసి మను ఇక్కడికే భోజనానికి వచ్చాడు.. వాడు వస్తున్న విషయం నాకు చెప్పాలి కదా అని తనపై అరుస్తుంది. వాడు ఎక్కడికో భోజనానికి వెళ్తున్నాడని చెప్తే నువ్వు ఏం అన్నావో గుర్తుకు తెచ్చుకోమని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. తను మాట్లాడిన విషయం గుర్తుకు చేసుకొని అనుపమ ఫోన్ పెట్టేస్తుంది. ఈ అనుపమ అర్థం కాదు వీడు అర్థం కాడు.. వీళ్ళు ఎప్పుడు అర్థం అవుతారో ఏంటోనని వాళ్ళ పెద్దమ్మ అనుకుంటుంది.
ఆ తర్వాత మా భోజనాలు ఎలా ఉన్నాయంటూ మనుని మహేంద్ర అడుగుతాడు. బాగున్నాయి.. అమ్మ చేతి వంట తిన్నాననిపించిందని మను అంటాడు. అనుపమ వంక మహేంద్ర చూస్తూ మా అనుపమ వంటలు అమ్మచేతి వంటలాగా అనిపించాయన్నమాట అని మహేంద్ర అంటాడు. మీ ఫ్యామిలీ గురించి చెప్పమని మహేంద్ర అంటాడు. మను మౌనంగా ఉండడంతో నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు.. కానీ మనం ఎప్పుడు ఇలానే ఉండాలి. మా ఇంటికి వస్తూనే ఉండాలి. మా కాలేజీకి చాలా హెల్ప్ చేసావని మహేంద్ర అనగానే.. మీరు ప్రతీసారి హెల్ప్ అని అనకండి. రిషి సర్ మిషన్ ఎడ్యుకేషన్ అంటు చాలా మందికి హెల్ప్ చేసాడని మను అంటాడు. అనుపమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత మను వెళ్లిపోతు.. అనుపమ వంక అదోలా చూసేసరికి వసుధారకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఈ మను, అనుపమ మేడమ్ కి సంబంధం ఏంటని వసుధార ఆలోచిస్తుంది. తల్లీ కొడుకులా సంబంధమని అనుకోవాలంటే మేడమ్ కి పెళ్లి కాలేదు. ఒకవేళ పరిచయమా అని అనుకుంటే ఇంత ఎమోషనల్ ఉంటుందా? ఏదో సంబంధం ఉందని వసుధార అనుకుంటుంది.
ఆ తర్వాత మను గురించి అనుపమ ఆలోచిస్తుంటుంది. మరొకవైపు మను కూడా అనుపమ గురించి ఆలోచిస్తు.. నా వాళ్ళు ఎవరని అడుగుతున్నారు.. ఏమని చెప్పాలి.. నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నారని మను అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం మహేంద్రకి ఫణీంద్ర ఫోన్ చేసి నీతో మాట్లాడాలి. నువ్వు ఒక్కడివే ఇంటికి రా అని చెప్తాడు. వసుధార, అనుపమ ఇద్దరు కాలేజీ కి బయల్దేరి వెళ్తుంటారు. మావయ్య మీరు కాలేజీకే కదా.. అందరం కలిసే వెళదామని వసుధార అంటుంది. లేదు అన్నయ్య ఇంటికి రమ్మన్నాడు ఏదో మాట్లాడాలని మహేంద్ర అనగానే.. నేను వస్తానని వసుధార అంటుంది. నన్ను ఒక్కడినే రమ్మన్నాడని మహేంద్ర చెప్పేసి వెళ్లిపోతాడు. శైలేంద్ర ఏమైనా ప్లాన్ చేశాడా ఏంటని వసుధార అనుకుంటుంది. మరొకవైపు ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే ఎండీ సీట్ నాదే అని దేవాయనితో శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్ర ఇంటికి రాగానే రిషి లేడని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు కానీ ఇబ్బందిగా ఉన్నా కానీ కర్మకాండ జరిపించాలి. అది రేపు జరిపించాలని ఫణింద్ర అనగానే మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |